Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మాదిరెడ్డి సులోచన షంషాబాదు గ్రామంలో 1935లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఏ.ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10 సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పనిచేశారు. భర్తతో పాటు ఇథియోఫియా, జాంబియా దేశాలకు వెళ్ళి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేశారు. ఈమె 1965లో 'జీవనయాత్ర' పేరుతో మొదటి నవల రాశారు. ఈమె దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలూ, పెళ్ళిళ్ళకంటే కుటుంబ జీవితానికి ప్రాధన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథారచయిత్రి అవార్డులు పొందారు.