సూర్యనమస్కారములు చేయదలచిన సాధకుడు శుభముహుర్తమున ఆచమనము చేసి ప్రాణాయామము గావించి, నదీతీరమున పరిశుద్ధ ప్రదేశమున పదహారు హస్తములు లేక పన్నెండు హస్తములు లేదా అవకాశమును బట్టి చతురస్రముగా వేదికను సిద్దము చేసి దానిమధ్యన ఒక హస్తప్రమాణముగా (24 అంగుళములు ఒక హస్తము అనబడును) వేదికను సిద్ధముచేసి ఉంచవలెను. పిమ్మట సాధకుడు సూర్యోదయపూర్వము స్నానముచేసి పరిశుద్ధముగా ఆరవేసిన తెల్లని వస్త్రములను కట్టుకొని పూజసంభారములతో సహా మండపము వద్దకు వచ్చి తూర్పు ముఖముగా కూర్చొని ఆచమనము చేసి ప్రాణాయామము గావించవలెను.
- ద్విభాష్యం సుబ్రహ్మణ్య శాస్త్రి