Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
నవయుగమున నరజాతికి సన్మార్గమును, సేవా కార్యక్రమముల రూపమున క్రమశిక్షణమును మాస్టర్ ఇ. కె. బోధించిరి. నిస్వార్థబుద్ధితో, విశ్వప్రేమతో నడచి కొన్ని వేల మందిని నడిపించిరి. ఆత్మజ్ఞానమును ప్రసాదించి అనుయాయులను కార్యోన్ముఖులుగా తయారుచేసిరి. మానవ జాతి కళ్యాణార్థమై వేదవిద్య, యోగవిద్యలతోపాటు వైద్యవిద్యను కూడా పంచి పెట్టిరి. మాస్టర్ హోమియో వైద్యాలయములను, బాలభాను విద్యాలయములను నెలకొల్పిరి. శాశ్వత జ్ఞానమును వ్యాపింపచేయుటకు అనేక గ్రంథములను రచియించిరి. సామూహిక సహజీవనములో గల మాధుర్యము ననుభవింప చేయుటకు 1962లో తమ గురుదేవులైన “మాస్టర్ సి.వి.వి.” పేర గురుపూజా ఉత్సవములను ప్రారంభించిరి. 1972లో “నావాణి", దర్శన మాసపత్రికను స్థాపించిరి. ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమును సాధించుటకై “ది వరల్డ్ టీచర్ ట్రస్ట్" (జగద్గురు పీఠము)ను 1971లో స్థాపించిరి. ఏడు పర్యాయములు పశ్చిమ ఖండములలో ఆధ్యాత్మిక ఉద్దీపన యాత్ర చేసిరి. అంతర్యామి స్వరూపులై వేలాదిమందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము ననుగ్రహించుచున్నారు.