భారతీయ ధార్మిక విషయాలన్నీ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వానిలో సంపూర్ణంగా ప్రతిఫలిస్తున్నాయి. భారతీయ ధర్మమే మానవ ధర్మము లేక సనాతన ధర్మము అని పిలువబడుతున్నది. ఈ ధర్మము వైదిక జీవన విధానం మిద ఆధారపడి ఉన్నది. కానీ ఈ సనాతన ధర్మాన్ని ఈనాడు మనం హిందూ ధర్మం అంటున్నాం. ఇతర దేశీయులు కొందరు 'స' బదులు 'హ' ఉచ్చరిస్తారు కాబట్టి సింధూ ప్రాంతంలో తొలుత ఉన్న ఆర్యులు అవలంబించిన వైదిక జీవన విధానం సింధూ ధర్మం బదులు హిందూ ధర్మం అయింది. దానిని ఆదరించే వారు హిందువులు అయినారు. ఇతర ధర్మాల వారికి వారి వారి మతాలు. 'మతము అంటే ఒక పాక్షిక వాదము అని మాత్రమే అర్థం.
- కొంపెల్ల రామకృష్ణమూర్తి