మేము ఈ వాయుపురాణ అంధికరణ చేపట్టేనాటికి, దక్షిణాదిన ప్రచారంలో ఉన్న వాయుపురాణ ప్రతులకు - ఉత్తర భర్తదేశమున ప్రచారము నందున్న కొందరు అచ్చులోకి తెచ్చిన వాయుపురాణ ప్రచురణ కర్తలు ఈ తేడాను పరిగణనలోనికి తీసుకోకుండానే, తమకు లభించిన ఎదో ఒక మూల ప్రీతిని అనుసరించి వాయు పురాణం ముద్రణ చేపట్టి ఉండవచ్చు!
అయితే పురాణాల పట్ల అవగాహన గలవారికి, ఈ ఉత్తర - దక్షిణ భారతదేశాలలోని మూలప్రతుల మధ్యా వైరుధ్యం స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. పండిత పామర జనరంజకంగా ప్రాచీన సాహిత్యాన్ని ఏది నవీనంగా తీర్చి దిద్దాలన్న, అంతవరకు లభ్యమవుతున్న సాహిత్యం పునఃపరిశీలించి తాము ప్రచురించదలచిన గ్రంధాన్ని అన్ని విధాలా ఉత్తమంగా అందించాలన్నది ముఖ్య సూత్రం.