పరమ శివుడు తపము చేయుచున్న ఆర్యాంబ శివ గురువులకు కుమారుడుగా జన్మించి శంకరాచార్యుడు అను నామధేయముతో 'అద్వైత సిద్ధాంతము' ను స్థాపించి వేద జ్ఞానములను ప్రబోధించుచు, వేద సమ్మతమగు అద్వైతమును దేశమంతటా వ్యాప్తి చేసి ప్రజలయందు ధర్మ స్థాపన చేతుననెను.
వెంటనే ఆదిశేషుడు భక్తిధానమగు ' విశిష్టాద్వైతము' ను స్థాపించి భగవద్వేషులను ఖండించుచు, తాను రామానుజస్వామిగా అవతరింతుననెను.