Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
యశః శరీరులైన నాన్నగారు - పెదనాన్నగారు
శ్రీ పి. నాగేశం
శ్రీ పి. నంజుండయ్య గార్ల
స్మృతి చిహ్నముగా
వారికి ఈ గ్రంథంలో స్తుతింపబడిన దైవం అన్ని విధాలా తోడు-నీడగా వుండాలని ప్రార్ధన.
ఈ రచయితకు వారిద్దరూ సోదరులవంటివారు ఎంతో వాత్సల్యంతో మన్నించే వారు ప్రత్యేకించి శ్రీ నాగేశం గారు ఈ రచయిత వ్రాసిన శ్రీ లీలా సమాధి (శిరిడీ బాబా పై వ్రాసిన గ్రంథం) నిత్యపారాయణం చేస్తూ అనేవారు - దీనికి మీరే వ్యాఖ్యానం చేసి ప్రచురించాలి - అని.
అలాంటివారి స్మృతి చిహ్నముగా ఈ పవిత్ర గ్రంథం అచ్చు కావాలి అని శ్రీ పళని స్వామికీ తదద్వతారమూర్తి శ్రీ రమణ మహర్షికీ ఇష్టమనుకొంటాను.
శ్రీ నంజుండయ్యగారు ఉత్తమ ఉపాధ్యాయులు, జాతీయ రాష్ట్రపతి బహుమతి గ్రహీతలు. వారు నన్నెంతో ప్రేమించేవారు. వారి కుమార్తె శ్రీమతి ఉమాసుందరి, ఎం.ఏ.లో నా శిష్యురాలు. ఆమె వల్లనే వీరితో నా అనుబంధం.
వారిని వారి పిల్లలను ఆ స్వామి నిత్యము కరుణించాలని భక్తితో ప్రార్థిస్తున్నాను.
-రచయిత