Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹99

                                                                                                                       తిథుల యందు చేయవలసిన పనులు
1.పాడ్యమి : శుక్ల పాడ్యమి - చెక్కపనులు, మంత్ర ప్రయోగములు, రోదన కృష్ణ పాడ్యమి - ఉద్యోగంలో చేరుటకు, యుద్ధం, పదవీ స్వీకారం, ఉపాసనకు, వైద్యసంబంధం, పొగాకు, మిర్చి పంటలు వేయుట ఆయుధ కర్మలు, ప్రజా సంబంధ పనులకు, యుద్ధ విద్యలు నేర్చుకొనుటకు, వివాహం, శుభ కర్మలు. అధిపతి-అగ్ని, రంగు-పసుపు.

2.విదియ: వస్తువుల వాడకం, దేవతా ప్రతిష్ఠ, ఆభరణములు ధరించుటకు, అన్నప్రాశన, ఉపనయనం, వివాహం, క్రొత్త బట్టలు ధరించుటకు, గృహారంభం, ప్రవేశములకు, కళలను నేర్చుకొనుటకు, వ్యవసాయం. అధిపతి-బ్రహ్మ; రంగు ఎరుపు.

3. తదియ : ఉపనయనం, నామకరణం, గర్భాధానం, నాట్యారంభం, కార్లు 
నడుపుట, నేర్చుకొనుటకు, చెవులు కుట్టుటకు, చిత్రవిచిత్ర వ్యాపారాలకు, గృహారంభం గృహప్రవేశములకు, వివాహం, అన్ని శుభాలు, దస్తావేజులు వ్రాయుటకు. అధిపతి-గౌరి; రంగు-తెలుపు.

4. చవితి: క్రూర కర్మలు చేయుటకు, ఇతరులను బాధపెట్టుటకు, శత్రువులను సంహరించుటకు, అబద్దములు చెప్పుటకు, మారణాయుధములు సేకరించుటకు, మంత్ర సేకరణకు, చెడ్డపనులు చేయుటకు, సేవకా పనిలో చేరుటకు. అధిపతి-గణేశ; రంగు-చిత్రవర్ణం.