ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు మొన్ననే లలితా సహస్రానికి వాక్యానం వ్రాశారు. నేడు సౌందర్యలహరీ సౌందర్య గరిమను వెలార్చారు. రేపు సుబ్రహ్మణ్య సహస్రానికి వ్యాఖ్యానాన్ని ముద్రింప సిద్ధపడుతున్నారు. అద్యతన కాలంలో ఆంధ్ర పండిత ప్రకాండుల్లో ఇలాంటి గ్రంథాల్ని సాధికారికంగా వ్రాయదగినవారు ఏమన్నా అది అత్యుక్తి కాదు.
వారి సమన్వయం మిక్కిలి శాస్త్రీయం. మోడరన్ సైకాలజి, భౌతిక శాస్త్రం, హత్య పండితుల భావజాలం మున్నగువాటితో నిండి ఉంటుంది. రామకృష్ణ మలను హంస, వివేకానందుడు, అరవిందుడు, రమణమహర్షి, శిరిడిబాబా, కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి, అభినవగుప్తపాదులు, శివానందమూర్తి, మనువాథ సత్యనారాయణ మొదలగువారి వాక్యాలు ఉపబలకంగా సాగుతుంది. మంతటి సంక్లిష్ట తాత్విక విషయాల్ని అయినా పై వారి సాదాసీదా మాటలతో తేటతెల్లం
సౌందర్యలహరిని వ్యాఖ్యానించడానికి ముందుగా శ్రీరామకృష్ణ పరమహంస వాలు జగతికి ప్రసాదించిన శారదామాతను గూర్చి విపులంగా వివరించారు. జగన్మాత పార్వతీదేవే ఈ శారదామాత అని ఆమె అపారకరుణ మనల్ని రక్షిస్తుందని ఒత్తూరు ఉన్న నంబూద్రిపాద్ మహనీయుడు ఆకాంక్షించిన తీరును ఆభక్తకవి ఆర్తిని మరించారు.
జగద్గురువులు శంకరులు ఎంతటి శాస్త్రకారులో అంతటి కవులు కూడా. వారి అపారమైన మేధ ప్రస్థాన త్రయం వ్రాసి అద్వైతస్థాపనకు ఉపకరణమయ్యింది. వారి పేశల హృదయం శివానందలహరి, సౌందర్యలహరి, మనీషా పంచకం. కకూ స్తవం, భజగోవిందం మున్నగువాటిలో కవితా సౌరభాన్ని విరజిమ్మింది.