పంచాంగ రచన బహుక్లిష్టమైనది. కత్తిమీద సాములాంటిది. గురుపరంపరానుగతంగా నాకు సంప్రాప్తించిన జ్ఞానాన్ని కఠోరమైన సాధనతో సానపెట్టుకుంటూ, ప్రాచిన గ్రంథ భాండాగారాన్ని మధిస్తూ ఈ పంచాంగ రచన చేస్తున్నాను.
వీలైనంత వరకు ఈ పంచాంగమును ఈ షన్మాత్ర దోష రహితంగా ప్రపంచానికి అందించాలనేది నా ప్రయత్నం. ముద్రణకు ముందుగా అక్షర కూర్పులు చేయాలి. మానవమాత్రులం గనుక కొండగచో ఏదైనా అక్షర దోషం వాటిల్లితే క్షంతవ్యుడిని. తామరతరంపరగా పంచాంగకర్తలు పుట్టుకరావటం, పుంఖను పుంఖాలుగా పంచాంగాలు ప్రజాబాహుళ్యంలోకి వస్తుండటం, పంచాంగకర్తలు స్వీయమనుగడ కోసం పరస్పర నిందారోపణలు చేసుకుంటూ విధుల పడటం వలన నిజమైన పండితులు సైతం ప్రజల నుండి అవమానాలు, అవహేళనలు ఎదుర్కోవటం జరుగుతున్నది.