ఈ మహాకాళీ తంత్రం అనేక ఉపాసనా రహస్యాలతో - సాధకులకు చూకాళీ అనుగ్రహం సులభంగా కలిగేలా అనేక కాళికా మంత్రములు. వ శ్లోకములు-అష్టోత్తర-సహస్ర నామములు- కవచములు- విశిష్ట స్తోత్రములు అనేక గ్రంథముల నుండి సంకలనం చేయడం జరిగింది - మరక కుమార్ ఒక మహాకళీ ఉపాసకుడుగా సంధానకర్త మాత్రమే నేను వ్రాసినది కాదు. కలియుగంలో విక్రమాదిత్య మహారాజు, కాళిదాస మహాకవి, వామాచరణ భట్టాచార్య, వామాక్షేపా ఎందరో అష్ట సిద్ధులు పొందారు.
తాంత్రిక యోగంలో కాళిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్వాణ తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించింది. నిరుత్తర తంత్రం, పిచ్చిలతంత్రం ప్రకారం కాళీ మంత్రాలు శక్తివంతమైనవి, గొప్పవి కాళీ విద్యలు.
మహాకాళీ మాత అనుగ్రహించి ఈ పుస్తకం సాధకులకు అందించడానికి సంపత్ కుమార్‌ను ఒక ఉపకరణంగా మార్చింది- అహం కరోమితి వృథాభిమానః గ్రంథ విషయం :
గతంలో మహాకాళ సంహితలోని 1-గుహ్యకాళీ తంత్రం 2-కామకళా కాళీతంత్రం 3 - కాళీ కర్పూరతంత్రం వ్రాయడం జరిగింది- కానీ వాటిలో లేనివి, దక్షిణ కాళికా, శ్మశాన కాళికా ఉపాసనా విధానాలు ఇందులో చేర్చడం జరిగింది.
ఈ శ్రీమహాకాళీ తంత్రంలో ప్రధానంగా 1-దక్షిణకాళీ 2-భద్రకాళీ 3-శ్మశానకాళీ ఉపాసనా విధానాలు అనేక గ్రంథాలనుండి సేకరించి ఇవ్వడం జరిగింది.