Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹900

శ్రీ భగవద్గీతా భాష్యార్మ ప్రకాశికానువాదము.

ప్రథమాధ్యాయము. ఇదృతరాష్ట్ర ఉవాచ : శ్లో॥ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |

మామకాః పాణవాశ్చైవ కిమకుర్వత సంజయ! || 'అ. గ్రుడివాడగు ధృతరాష్ట్రుఁడు, తనకు భారత యుద్ధ చరితముఁ జెప్పుటకు వ్యాసమహర్షిచే నాజ్ఞాపింపబడి వారిచే నొసగబడిన శక్తి గల సంజయునితో ప్రశ్నోత్తరరూపముగా వ్యవహరించెనని వ్యాసులు చెప్పుచున్నారు. “ధృతరాష్ట్ర ఉవాచ” అని. ఇచట ధృతరాష్ట్ర పదమువలన నేరిచే జగద్రూపమగు రాజ్యము ధరింపబడినదో, అట్టి యీశ్వరుడు అని | 'భగవత్సరణరూపమగు మంగళమును, బాదరాయణులు వ్యంజనావృత్తిచే గ్రనాదియందుఁ ' గూర్చిరని గ్రహింపవలయును. లేనిచో, గీతాశాస్త్రము భారత గ్రంథమునందుఁ జేరినదగుటచే,

భారత గ్రనాదియం దొనర్చిన మంగళమే, గీతాశాస్త్రమునకు గూడ మంగళాచరణమగును కాన నిచట మంగళాచరణముతోఁ బనిలేదని యూహింపవలయును. వస్తుతః గీతాశాస్త్రము ద్వితీయాధ్యాయము నందలి “అశోచ్యానన్యశోచస్వమ్" అను శ్లోకముతో నారంభమగు చున్నందున నచట "భగవానువాచ" అని భగవత్స్మరణాత్మకమగు మంగళాచరణము కలదని గ్రహించుట యుక్తము. ఇచట “ఉవాచ" యనగా అడిగెనని యర్థము. సంజయుని గూర్చి యడిగెనని యధ్యాహారముఁ జేసికొనవలయను.

ఓయి సంజయుడా! పుణ్యభూమియగు కురుక్షేత్రమునందు యుద్ధముఁజేయఁ దలంపుతోఁ గూడిన మావారు, పాణురాజు వారలును యేమి యొనర్చిరి? (అని యన్వయము) తుతిస్మృతులచే విధింపబడి, స్వర్గాది పుణ్యలోకములకుఁ గారణమగు యజ్ఞము, యుద్ధము, మున్నగునది ధర్మమనంబడు. అదాని ననుష్ఠించుటకు విహితమగు స్థలమును ధర్మక్షేత్ర మందురు. పుణ్యభూమి యగుటచే నీ కురుక్షేత్రమునం దనుష్టించిన కొలది ధర్మము, గొప్పఫలము | నొసంగునని యీ విశేషణమువలన స్పష్టమగుచున్నది. కావున కురురాజులచేఁ బాలింపఁబడు నీ పుణ్యభూమియందు యుద్ధముఁ జేయఁ దలంపుతో గూడిన నా కుమారులగు దుర్యోధనాదులు, పాణురాజు సంతానమగు ధర్మరాజాదులు, చకారము వలన వారి సహాయులు, ఏవకారము వలన సుభయుల చతురణ సైన్యములు యేమి యొనర్చిం? యుద్ధమును సలిపిరా? లేక సంధి యొనర్చిరా? అని ధృతరాష్ట్రుని ప్రశ్నకు అర్థము. ఇచట యుద్ధకర్మము యొక్క ఫలమగు జయము ఆత్మగామి యగుటవలన, (తనకు చెందుటవలన) నాత్మనే పదము ప్రయోగింపబడినది. 1 |......