భూశుద్ధిః మొట్టమొదట ఈ క్రింద తెల్పబడిన శ్లోకము చదివి, పూజాపీఠము ముందు కొంచెము నీళ్ళు చిలకరించవలయును.
శ్రీ ఉత్తిష్ఠను భూతపిశాచాః ఏతేభూమిభారకాః
ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
లక్ష్మీదేవికి నమస్కరించి ఎడమచేతితో ఉద్దరిణితో నీరు తీసుకుని ఈ క్రింద తెలిపిన శ్లోకము చదవాలి.
ఆ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివా |
యస్మరేత్ పుండరీకాక్షం! సభాహ్యాభ్యాంతరశ్శుచిః ||
అని తలచి ఉద్దరిణిలో గల నీటిని శిరస్సుపై మూడుసార్లు జల్లుకుని మనస్సులో 'పుండరీకాక్ష' అని మూడుసార్లు అనుకోవాలి. ఆ తర్వాత బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవి ఫోటోకు ప్రతిమకు నైఋతిలో దీపారాధన చేయాలి. తర్వాత కేశవనామాలతో ఆచమనము చేయాలి.
ఆచమ్య- కేశవాయస్వాహా, నారాయణాయస్వాహా, మాధ వాయ స్వాహా, గోవిందాయనమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్ర మాయనమః వామనాయ నమః శ్రీధరాయనమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయనమః సంకర్షణాయనమః వాసు దేవాయనమః ప్రద్యుమ్నాయనమః అని రుద్దాయనమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయనమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయనమః ఉపేంద్రాయ నమః హరయేనమః శ్రీకృష్ణాయనమః
ఆచమనము చేసిన పిమ్మట దీక్షనిర్విఘ్నముగా కొనసాగటం కొరకు గణపతినీ, ఇతర దేవతలను తలుచుకోవాలి.