Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
నా కృష్ణ
మా కృష్ణుడు (అడుసుమిల్లి వెంకట కృష్ణకౌశిక్) పుట్టినరోజు 22.12.1982. చూసిన బంధువులందరూ భలే బాగున్నాడన్నారు. అమ్మమ్మ మురిసిపోయింది. తాతమ్మ 'మేలిమి' అన్నది. బుధవారం రోజు బుద్ధిమంతుడు పుట్టాడన్నారు.
స్కూల్ లో చాలా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకొన్నాడు. వాళ్ల క్లాసీచర్ కృష్ణుడ్ని తన బల్లమీదే కూర్చోబెట్టుకునేవారు. మా కృష్ణుడు ఎంత చదువరి అంటే, 8వ తరగతిలో ఉన్నప్పుడు, "అమ్మా! మా స్కూల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసాను, ఇంకా బుక్స్ కావాలి” అని అడిగాడు
నాల్గు సంవత్సరాలపుడు గోడమీదినుంచి పడి తలవెనుక చిట్లితే డాక్టర్ వీచెస్ వేసి, “పెద్దవాళ్ళు కూడా స్టిచెను కేకలు పెడతారు, మీ బాబుకు చాలా ఓర్పండి” అన్నారు.
చిన్నప్పటినుంచే కృష్ణుడికి సేవాదృక్పథం అలవాటు అయ్యింది. అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి తను డొనేషన్ ఇవ్వటమేకాక, స్కూల్ లో కూడా డొనేషన్స్ సేకరించి ఇచ్చేవాడు.
వాళ్ల నాన్నగారంటే తనకి చాలా ఇష్టం. "నేనూ మా నాన్నగారిలా
ధైర్యంగా ఉండాలి. నాన్నగారి గైడెన్స్ నాకు బాగుంటుంది" అనేవాడు.
కృష్ణుడు గుంటూరు మెడికల్ కాలేజీలో ఎం.బి.,బి.ఎస్.ని: కొయంబతూర్ పి.ఎస్.జి. కాలేజీలో ఎం.డి. జనరల్ మెడిసిన్ ని పూర్తిచేసి, డి.ఎమ్. నెఫ్రాలజీలో మొదటి సంవత్సరం పూర్తిచేశాడు.
గుంటూరులో హౌస్ సర్జన్సీ చేస్తుండగా, “అమ్మా! 12 సంవత్సరాల కుర్రాడొకడు, హాస్పిటల్ లో పేషంట్, నా చేయి పట్టుకుని 'అన్నా,............