Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹63

                       ఆంధ్రదేశ చరిత్రలో క్రీ.శ. 7వ శతాబ్ది నుంచే రెడ్లు శాసనాల్లో తమ ఉనికిని చుకొన్నారు. రాష్ట్రకూట ప్రముఖులుగా పిలువబడి తరువాత 'రటోడ్లు' 'రట్టగుడి', చివరకు 'రెడ్లు'గా మారారు. రట్టడి లేక రట్టోడి, రట్టగుడి అంటే గ్రామసీమల్లో పన్నుపచుత్వానికి చెల్లింపులు, న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలైన పాలనాలను నిర్వహించే ఒక వ్యవస్థగా పేర్కొనవచ్చు. ఈ “రట్టడికం” వంశపరంపరగా లభించే హకుగానూ, పదవిగానూ ఉండేది. రట్టడికాన్ని నిర్వహించే పెద్దను రట్టోడి లేక రడ్డి లేక రెడ్డివాళ్పు. గ్రామ రక్షణతోపాటు వ్యవసాయాభివృద్ధి కూడా ముఖ్యమైనది కాబట్టి రెడ్డిని కాపుగా పిలిచేవాళ్ళు. రాష్ట్రకూటుల పాలన తరువాత అంటే క్రీ.శ. 973 నుండి, నేటి తెలంగాణా,రాయలసీమ ప్రాంతాలను పాలించిన కల్యాణీ చాళుక్యుల పాలనలో కూడా రెడ్లు రట్టడికాల్ని నిర్వహించారు. క్రీ.శ. 11వ శతాబ్దికి “రెడ్డి” అనే పదం కులాన్వయంగా వాడుకలోకి వచ్చింది.

                         కల్యాణీ చాళుక్యుల తరువాత ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకి తెచ్చిన కాకతీయులకు రెడ్డి వీరులు సహకరించారు. కాకతీయ మొదటి ప్రోలరాజు దగ్గర రేచర్ల బమ్మిరెడ్డి (బమ్మసేనాని) సేనాధిపతిగా ఉండి, అనేక యుద్ధాల్లో పాల్గొని - రాజుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. రెండవ ప్రోలరాజు సైన్యాధ్యక్షుడైన రెడ్డి కులస్థుడు కామచమూపతి, అతనికి మంథని యుద్ధంలో సహకరించి, గుండ్యనను సంహరించాడు. కామచమూపతికి రేచెర్ల బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ఇద్దరు కొడుకులున్నారు. వాళ్ళిద్దరూ కాకతీయ రుద్రుడు, గణపతిదేవుల సేనానాయకులుగా పనిచేశారు. రేచర్ల వంశానికి చెందిన రుద్రుడనే రుద్రిరెడ్డి గణపతి దేవుని సర్వసైన్యాధ్యక్షుడు. ఇతని తరువాతి తరము వారు సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రిని రాజధానిగా చేసుకుని పాలించారు. ఇదే కాలంలో నెల్లూరి సీమను పాలిస్తున్న తెలుగు చోడరాజైన తిక్కన సైన్యంలోనున్న రెడ్డి వీరులు, కర్నాటకరాజు నోడించడంలో ప్రధానపాత్ర పోషించారు. గోన గన్నారెడ్డి, గోన విఠలరెడ్డి, గొంకారెడ్డి, కాకతి రుద్రమదేవికి, ప్రతాపరుద్రునికి సామంతులుగా ఉంటూ ప్రభువులకు విధేయ సహాయకులుగా ఉన్నారు.