కరుణారసమూర్తి పార్థసారథి శ్రీకృష్ణ భగవానుని ముఖ పద్మము నుండి జాలువారిన శ్రీ మద్భగవద్గీత మరియు భీష్ముడు భోదించిన శ్రీ విష్ణు సహస్రనామ గ్రంథములకు సుమనోహర వ్యాఖ్యానంతో ఐదు దశాబ్దములుగా 'గేయం గీతానామ సహస్రం' అన్న శ్రీ శంకరుల వాణిని ప్రచార ప్రభోదములు గావించిన గీతా సాహిత్య శిరోమణి బిరుదాంకితులు కీర్తిశేషులు పండిత పెమ్మరాజు రాజారావు గారు గీతా సాహిత్య వినీలాకాశంలో ధృవతార.
ఈ గ్రంథము 'శ్రీ గీతామృతము' వీరి గురుదేవులు అపర శ్రీరామ అవతారులు నామ ప్రయాగ బుద్దాంకు చెందిన మహామండలేశ్వర్ శ్రీశ్రీశ్రీ 'శ్రీరామ శరణ్' సద్గురు దేవుల దివ్య ఆశీస్సులతో విఖ్యాత పుస్తక ప్రచురణ సంస్థ 'గొల్లపూడి' వారి సౌజన్యంతో ముద్రితం కావడం ఆ జగద్గురువైన 'శ్రీకృష్ణుని లీలామృతము'. ఈ
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పెమ్మరాజు రాజారావు గారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి దివ్య సమక్షంలో పలుమార్లు శ్రీమద్భగవద్గీతపై ప్రవచనం చెప్పడం అనితర సాధ్యమైన విషయం.
గీతాచార్యునకు ప్రతిరూపమైన ఈ శ్రీగీతామృతము' గ్రంథరాజము శ్రద్ధాళువై కేవలం పఠనం చేసిన మాత్రమున అత్యంత దుర్లభమైన శ్రీకృష్ణ భగవానుని కృపాకటాక్షం అతిసులభముగా లభించుట తథ్యము.