వస్తు ప్రపంచమే వాస్తవమైనదని హేతువాదుల నిర్ణయము. ఈ నిర్ణయానికి మూల పురుషుడు హెరాక్లిటాస్ అనే భౌతిక మేధావి. అతడు మేడ పైకి చేరే మెట్లు, మేడ క్రిందకి చేరే మెట్లు ఒకటే! కాబ్బటి మంచి , చెడ్డలేవు అని చెప్పాడు. ఈ విషయాన్ని మరికొందరు ఇంకా విపులీకరించి మంచి, చెడ్డ అనేవి లేవు. అని వస్తువులు కావు. వస్తువుల ఉనికి మాత్రమే సత్యమైనది. వస్తువులు కానివాటి ఉనికికి ఎలాటి అస్తిత్వం లేదు. భావాలకి రూపం ఉండదు. అవి కంటికి కనిపించే వస్తువులు కావు అని చెప్పారు.
భారత దేశానికీ చెందిన ప్రాచీన ఋషులు వస్తు ప్రపంచాన్ని నూటికి నూరుపాళ్ళు అంగీకరించారు. వాస్తవము అనే పదం యొక్క వ్యుత్పత్తి అర్ధమే దాన్ని తెలియజేస్తోంది . వస్తువులకి సంభందించినది వాస్తవం. దానికి సత్యం అని అర్ధం ." బ్రహ్మసత్యం జగన్మిధ్యా " అనే సూత్రాన్ని హేతువాదులు అర్ధం చేసుకోలేక పోయారు. జగత్తు వ్యావహారిక సత్యం.