Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అందరికీ తలలో నాలుకలా ఉండే ఆ మహిళ ఎందువల్ల మరణించిందో, కన్నతల్లి మీద అభాండం వేసిన ఆ కొడుకు ఏం బావుకున్నాడో,
పిల్లల మధ్యే పండుకుంటూ ఉన్న గృహిణికి వైద్యుడు హితబోధ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో, చావు భయం లేదని ఢంకా భజాయించిన ఆ తల్లి జీవనయానం ఎటు సాగిందో, ఇద్దరి యువకుల జీవితాలు తీర్చిదిద్దాలని చూసిన ఆ ఉపకారికి ఎదురైన గడ్డు పరిస్థితి ఏమిటో, ఆ యువకుడిలో తన హీనమైన బాల్యం తదుపరి దశలలో ఎటువంటి రూపు దిద్దుకుందో, దయా దాక్షిణ్యాలతో ఎదిగిన ఆ యువతి తన ప్రత్యుపకారం ఎలా తీర్చుకుందో, స్పర్శతో కన్న కొడుకును ఆ తల్లి ఎలా కాపాడుకోగలిగిందో, ఆ దివాణంలో పడమటి గది చుట్టూ అల్లుకుని ఉన్న విచిత్ర భావన ఏమిటో, పెళ్ళికీ తన చావుకూ సంబంధం ఉందన్న ఆ యువకుడి గమ్యం ఏమిటో, కలికి కడగంటి చూపునకూ, ఎండవాలుకూ సంబంధం ఏమిటో, అమ్మను పిన్ని మరపించిందో లేదో... వంటి అనేక జీవిత వాస్తవాలకు అద్దం పట్టే కథా చిత్రణ, నాటకీయత, వేగవంతమైన నడక, సహజసిద్ధమైన సంభాషణలు ఇవీ... మేడా మస్తాన్ రెడ్డి "స్పర్శ” రచనలు.