Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
బతుకు గమనాన్ని సంవత్సరాలతో కొలవడం పద్దతేమో కానీ నేను నడిచొచ్చిన అరవై యేళ్ల కొలమానం వేరే. గాయాల యోజనాలు ,కన్నీళ్ల క్రోసులు ,అవమానాల ఎగుడుదిగుళ్లు పంటిబిగువుల మైళ్లు దాటొచ్చిన యాత్ర నాది. రవ్వంత సౌఖ్యంతోనూ, అస్సలే లేని లౌక్యంతోనూ కొలవాలి. వచ్చిపడ్డ రాళ్లతోనూ మెచ్చిపడ్డ పూలతోనూ కొలవాలి. కష్టమెరుగని బాల్యం సుఖమెరుగని యవ్వనం అనుక్షణ గండంగా జీవితం అరలు పొరలుగానే సాగింది . అదంతా నేను నా కవిత్వంలోనే చెప్పేసాను. ఇక మిగిలిందేమీ లేదు. ఇక్కడ నేను చెప్పాల్సిందల్లా ఈ వ్యాసాల సంకలనం ఎందుకు వేయాల్సొచ్చిందా అనే సంజాయిషీ మాత్రమే. ఇంత
రాసాం కదా.. అక్కడా ఇక్కడా సాహిత్య విమర్శ పేరిట చాలా మంది అర్ధం కాలేదన్నారు కదా, కొందరు అద్భుతం అన్నారు కదా అసలు నిజంగా మొత్తంగా నేను లేదా నా కవిత్వం సాహిత్య ప్రపంచానికి ఎలా అవగతమైంది, నాగురించి ఎంత అర్ధం చేసుకున్నారు, ఎలా అర్ధం చేసుకున్నారు అనేది తెలుసుకోవాలన్న నా తాపత్రయ ఫలమే ఇది. అరవై ఏళ్ళు అనే సాకును అరువు తెచ్చుకున్నాను. అంతే కానీ షష్టి పూర్తి అనే ఛాందసమో సాంప్రదాయమో కానే కాదు. నేనెంత అర్ధం కాలేదో | తెలుసుకోవడానికి ఈ వివేచన ఏమైనా ఉపయోగ పడుతుందేమోనని ఆశించాను. పర్లేదు.. బాగానే ఉపయోగ పడింది. చాలా మంది పెద్ద మనసుతో అర్ధం అయింది అర్ధం కానిదీ |........