Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
తెలుగునందలి భక్తి వాజ్మయంలో శివభక్తి సాహిత్యం, విష్ణుభక్తి సాహిత్యం అని ప్రధానంగా రెండు పాయలుగా ప్రవహిస్తుంది. పాల్కురికి సోమనాథుడు రచించిన గ్రంథాలలో బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, బసవోదాహరణం, నషాధిప శతకం, బసవ రగడ మొదలైనవి ప్రధానములైనవి. శ్రీనాథకవి సార్వభౌముడు శృంగారనైషధం, కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం ఇత్యాది గ్రంథాలు రచించాడు.రాయల ఆస్థానమందలి అష్టదిగ్గజ కవులలో సుప్రసిద్ధుడు ధూర్జటి మహాకవి - శ్రీకాళహస్తి మాహాత్మ్యం , శ్రీకాళహస్తీశ్వర శతకం - అను రెండు శివసంబంధమైన గ్రంథాలు రచించాడు. ఇంకా ఎందరో మహాకవులు శివ సంబంధమైన సాహిత్యం సృష్టించి, తెలుగు సాహితీ సరస్వతిని సమాదరించినారు.
పాల్కురికి సోమనాథుడు దేశీయమైన 'ద్విపద ఛందస్సులో రచించిన బసవ పురాణ మందలి “గొడగూచి” కథ, “బెజ్జ మహాదేవి”కథల - పరమార్థాన్ని నా ఈ గ్రంథంలో సరళంగా వివరించాను. శ్రీనాథుని కాశీఖండ మందలి “గుణనిథి” కథ, హరవిలాసమందలి "చిఱుతొండనంబి” కథ, శివరాత్రి మాహాత్మ్య ప్రబంధ మందలి “సుకుమారుని” కథ రసజ్ఞ మనోజ్ఞంగా రచించాను. ధూర్జటి కవీంద్రుని "శ్రీకాళహస్తి మాహాత్మ్యం ” నందలి "తిన్నడి” కథను, "నత్కీరుని” కథను పరమ హృద్యంగా, రమణీయంగా వివరించాను.
ఇంకను తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు శివభక్తుల కథల్ని మనోహరంగా రచించి, పరమశివుని ఆరాధించి, ముక్తిని పొందారు.
డా. జంధ్యాల పరదేశి బాబు