ఈ సంపుటంలో సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల పై గత రెండు దశాబ్దాలుగా వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాలు ఉన్నాయి. ఆంధ్రభూమి దినపత్రికలో "శిప్ర వాక్యం " శీర్షికతో వచ్చిన వ్యాసాలు ఎక్కువగా ఉన్నాయి.
"మాస్టారు! ఏ రోజుకారోజు దినపత్రికలో చదివి, వదిలి పెట్టె రచనలు కావివి. పరిశోధక విద్యార్థులకు పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు బంగారం గనుల వంటివి. వీటిని గ్రంధరూపంలో తెచ్చి మా అమ్మ - నాన్నలకు అంకితం చేయండి" అని అపర ఘంటసాల డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ కోరిక మేరకు వీటిని ఒక సంపుటంగా తీసుకోని రావడం జరిగింది. ఈ సెలెక్టెడ్ వ్యాసాలు ప్రధమ భాగం మాత్రమే. విలువెంట ద్వితీయ, తృతీయ భాగాలు కూడా వెలువడుతాయి.
ఇది చారిత్రక నవలాచక్రవర్తి 105 వ రచన.