Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


OUT OF STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

ఎందుకు రాశాను? 'శూన్యం

ఇసామియా బజార్ సందుల్లో మలుపు తిరిగింది. జీవితం. పెనం పైనుంచి పొయ్యిలో పడడమంటే అదే మరి. గదమాయించడానికి, చీదరించడానికి, చిల్లరపనులు చెప్పటానికి పెద్దవాళ్లు లేరు. కాని లొంగుబాటులో సుఖం ఉంది. మిగిలిందో, సగిలిందో తినటానికేదైనా దొరుకుతుంది. పడుకోవడానికి పాకయినా ఉంటుంది. మరి నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే నీ రెక్కలతో నువ్వెగిరిపోవాలనుకుంటే........

పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో "ఎగిరిపో! నీకు స్వేచ్చనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు.

"ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా? అని అడిగిందట పక్షి. '83లో అదీ పరిస్థితి.

ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ 'లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా

ప్రతిరూపాలే.

హైదరాబాద్ అంతటా కరెంటు ఉంటుంది- మా యింట్లో తప్ప. బిల్లు కట్టగల స్తోమత అక్కడెవరికీ లేదు మరి. ఆరు గదుల్లో ఆరు కుటుంబాలు. రూపాయి ఉన్నవాళ్లు ధనవంతులు. ఆ ఉంటే మధ్య తరగతి. తరగతులకేం గాని, పావలా ఉంటే రోజు. గడుస్తుంది. (అప్పటి పావలా ఇప్పటి సుమారు పదిరూపాయలని యువ పాఠకులు గుర్తించాలి) అదీ లేకపోతే? తిరుగు. ముఖపరిచయమున్నవాళ్లతో కల్లబొల్లి కబుర్లు...............