Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹360

“అరుణో దయ"

1-1-1947 గ్రంథమునం దే ప్రకరణమున ఏపుట తీసి చదివినను విమర్శ వాత్మకమగు శిల్పచర్చ కానవచ్చుచున్నది. మొదటి ఆరు ప్రకరణములలో శిల్పతత్త్వమునుగూర్చిన హృదయభావోదారము ప్రవాహమువలె పర్వు లెత్తినది. ఇందలి ఉత్కటభావములు ఉద్దుర ధారాతరంగములై పాఠకుని శిల్పత త్వము యొక్క అగాథపు లోతులలోనికి గొంపోయి ముంచి వేయు చున్నవి. ఈ ఆరు ప్రకరణములు - నిశిత బుద్ధి, శిల్పత త్వజిజ్ఞాస గల ఊర్జితభావ సంపన్నులకే వేద్యమగునంతటి భావైకమయ జగత్తులోని బాటలుగా ఉన్నవి. గ్రంథకర్తకుగల వేదవేదాంగపాండిత్యము, శిల్పశాస్త్ర వైదుష్యము, సాహితీప్రౌఢిమ గంగా యమునా సరస్వతులవలె కలసి పరువులు పెట్టుచున్నవి.

సమరాంగణుని రసయంత్రమునుగూర్చి సందేహించువారు అమెరికా లోని ది ఫెల్ బాంబర్లు (MERCURIAL VAPOUR) పాదరసపుటావిరితో తయారు చేయబడినటు వారి LITERARYDIGEST లోని వ్యాసమును చదివి తెలిసికొని, తమ అజ్ఞతకు తల వాల్చుకొనగలరు. .... "సాపత్య వేదము" నకు పూర్వాధ్యాయములు ప్రాచీనార్ల దృష్టిని, ఈవలి అధ్యాయ ములు నేటికాలపు పరిశోధనా దృష్టిని వెలయించి శిల్పదర్శనములో శిల్ప మహిమదర్శనమును అందించుచున్నవి. గ్రంథకర “ఆత్మదర్శనము ''న జ్ఞానమును, శిల్పదర్శనమున విజ్ఞానమును ఆంధ్రలోకమునకు పంచి త్రిలింగ భారతికి అపూర్వరమణీయమైన సేవ చేసియున్నారు. వీరి కృషి చిరాభినందనీయము. విద్యాలయములు, గ్రంథాలయములు, ప్రజలు , పండితులు ఉపయోగించుకొనవలసిన గ్రంథము -.......