Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఆకాశం అంతా నల్లగా మబ్బు పట్టి ఉంది. ఇద్దరు పోలీసులు ఆ చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్న కాలనీలోకి వచ్చి ఒక చిరునామా కోసం వెతికారు. వీళ్ళలో ఒకరు 'ఒంటికన్నోడు'.ఒళ్ళు విరుచుకుంటూ ఒక బిల్డింగ్ రెండో అంతస్తు వైపు నడిచాడు. రెండో వాడు 'పుడింగి' వెనుకే నలిగిపోయిన యూనిఫాంతో ఫాలో అవుతున్నాడు.
అమర్నాథ్ పదమూడు సంవత్సరాల తన కూతురిని స్కూల్ వేన్ ఎక్కించి మెల్లగా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఆ ఇద్దరు పోలీసులు వెతుక్కుంటూ వెళ్లి ఒక ఇంటి తలుపు తట్టారు. కుర్తా బనియన్ వేసుకున్న ఒక మధ్య తరగతి మనిషి వచ్చి తలుపు తీసాడు.
“మీరు..” అడిగారు పోలీసులు. “అమర్‌నాథ్” తన పేరు చెప్పాడు. 'ఉన్నట్టుండి పోలీసులని చూడగానే కాస్త భయపడ్డాడు. “లోపలికి రావచ్చా" వెంటనే 'రండి' అన్నాడు అమర్‌నాథ్,
"ఏంటి విషయం? మా అమ్మాయి ఇప్పుడే స్కూల్ కి బయలుదేరింది" అన్నాడు కంగారుగా,
తల గోక్కుంటూ నిలబడిన పోలీస్ ఒక ఉత్తరం తీసి ఇచ్చాడు. అక్కడ హాల్ లో ముందు వైపు మాల వేసి తగిలించి ఉన్న ఇద్దరు వృద్ధుల............