భారతీయ తత్త్వశాస్త్రంలో దర్శనాలకు ఎనలేని స్థానం ఉంది. వేద ప్రమాణాన్ని అంగీకరించని దర్శనాలను నాస్తిక దర్శనాలని, అంగీకరించిన దర్శనాలను ఆస్తిక దర్శనాలని అంటారు. నాస్తిక దర్శనాలు ప్రధానంగా చార్వాక, బౌద్ధ, జైనాలు, ఆస్తిక దర్శనాలు న్యాయ, వైశేషిక, సంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసా, దర్శనాలు.
ఈ దర్శనాలను రేఖామాత్రంగానైనా అర్థం చేసుకుంటే ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను, త్రిమతాలను సమగ్రంగా అవగాహనలోకి తెచ్చుకోవడం సులభమౌతుంది.
ఈ దర్శనాల మీద ఉద్గ్రంథాలు సంస్కృతంలోను, తెలుగులోను, ఆంగ్లంలోను కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ అత్యంత గహనంగా, గ్రాంథిక భాషలో, సాంకేతిక పదవిన్యాసాలతో రచించబడి సామాన్యులకు దురవగాహ్యంగా ఉన్నాయి.
- కళానిధి సత్యనారాయణ మూర్తి