Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹500

నా అక్షరయాత్ర కాలేజీ విద్యార్థి దశలో ప్రారంభమైంది. కథలు రాయడం మొదలెట్టిన రెండేళ్ళకు నవలారచనకూ శ్రీకారం చుట్టాను. నామొదటి నవల 'బతుకుబాట' 1957లో ప్రజామత వారపత్రికలోనూ, రెండోనవల 'సహృదయులు' 1960లో ఆంధ్రప్రభ వారపత్రికలోనూ సీరియల్స్ గా వచ్చాయి. ఆతర్వాత పుస్తకాలుగానూ వెలువడ్డాయి. పుస్తకాలుగా వచ్చినప్పుడు ప్రచురణకర్తల సూచనల మేరకు 'బతుకుబాట'ను వెలుగురేఖలు”గానూ, 'సహృదయులు'ను 'కాంతిపూలు”గానూ వాటి పేర్లను మార్చవలసి వచ్చింది.

కాలేజీ జీవితం ముగిసి ఉద్యోగపర్వం మొదలైన నాలుగేళ్ళకు మరో రెండు నవలలుకరుణించని దేవత' 1964లోనూ, 'మైనా' 1965లోనూ అచ్చయ్యాయి. ఈ రెండు నవలలు పునర్ముద్రణలు పొందినా, మొదటి రెండూ విద్యార్థి దశలో రాసినవి కావటం వలన, సుమారు ఆరు దశాబ్దాలు గడచినా వీటి పునర్ముద్రణపట్ల శ్రద్ధ వహించలేదు. కాని కవిత్వంలో ప్రయోగాలు చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా 'బతుకుబాట' నవలను వచన కవిత్వ ప్రక్రియలో నవలా కథనకావ్యంగా 2006లో రాసి ప్రచురించాను.

ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న నా జీవనయానంలో ఆరుదశాబ్దాల కాలాన్ని అధిగమించిన నా అక్షరయాత్రకు సంబంధించి వస్తు స్వీకరణలోనూ, నిర్మాణ శిల్పంలోనూ నా రచనల్లో వచ్చిన పరిణామాన్ని పాఠకులు అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందని యిదిగో.