Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
సీక్రెట్ పవర్ అంటే రహస్య శక్తి. అయితే ఇది నిజంగా రహస్యం కాదు, బహిరంగ రహస్యమే. మన రాత మనమే రాసుకుంటాము. ద పవర్ ఆఫ్ ఎట్రాక్షన్. మీరు పదే పదే ఏదైతే అంటుంటారో మీకు అదే జరుగుతుంది. సీక్రెట్ పవర్ అంటే మనందరిలోనూ ఒక అద్భుతమైన శక్తి దాగి ఉన్నది. ఆ శక్తిని గుర్తించడానికి టైమ్ పడుతుంది. గుర్తించిన వాళ్లు ముందుకు సాగుతారు. గుర్తించలేని వాళ్లు నా కర్మ, నా జాతకం, నా నక్షత్రాలు అలా ఉంటే నేను ఏం చేయను. అంటూ సర్దుకుపోతుంటారు. జాతకం బాగాలేదు. నక్షత్రాలు కలవట్లేదు అని వాళ్లకు సైకలాజికల్ గా ఒక సజెషెన్ ఇవ్వగానే అక్కడే ఆగిపోతారు.
నువ్వు కష్టపడితే ఎందుకు పాస్ అవ్వవు. నువ్వు సాధించాలి అనుకుంటే ఎందుకు సాధించలేవు. నువ్వు మారాలని అనుకుంటే ఎందుకు మారలేవు. నీలో నువ్వు ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నప్పుడు నీకు ఎవరు అడ్డుపడతారు. ఎవరైనా అడ్డుపడితే మనుషులే అడుపడాలి. అంతే తప్ప ఏదో దేవుడికి కోపం వచ్చి కాదు.యుఆర్ యువర్ హీరో. నిజంగా పనిచేస్తే, శ్రమిస్తే మీరు సాధించిందంతా మీ ప్రయోజకత్వమే. మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఏ ప్రయత్నమూ చేయకుండా మీ వైఫల్యానికి రకరకాల వంకలు చెప్పుకోవడం చేతగాని వాళ్లు మాట్లాడే మాటలు. మీరు విభిన్నంగా ఆలోచించాలి. నా భవిష్యత్తుకి, నా విజయానికి, నా ఓటమికి, అన్నింటికీ నేనే కారణం. మిమ్మల్ని మీరు బలహీనులనుకోవద్దు.
నేను బలవంతుణ్ణి, ఇంకా బలవంతుణ్ణి, అందరికంటే బలవంతుణ్ణి.