మనిషి మనుగడ కోసం పోరాడాడు.
వేటాడే చోటి నుంచి వ్యవసాయం దాకా వచ్చాడు.
గుహాలనుంచి మహానగరాల దాకా మారాడు.
ప్రకృతిలోని ప్రతి విషయాన్ని తన సౌకర్యం కొరకు వాడుకోవడం నేర్చుకున్నాడు.
తన బతుకు, పరిసరాలు, తన ప్రయత్నాలు అన్నీ
సైన్స్ పరిశోధనలే అని మొదట్లో తెలియదు.
నాటి నుండి నేటి వరకు
ఈ పరిశోధనలు, పరిశీలనలు సాగుతూనే ఉన్నాయి.
ఆ క్రమాన్ని సులభంగా వివరించే పుస్తకం మీ చేతిలో వుంది.
మన గురించి మనం తెలుసుకోవడంలో ఉన్న ఆనందాన్ని..
తెలుసుకోవడమనే వెలుగులను....
మీరు కూడా ఆనందం అనుభవించండి.
- కె. బి. గోపాలం