ఈ నాటకం పై పై చుపులకు వుత్తిత్తి మెరుపుల్లా కనిపించినప్పటికీ ఇందులో సీరియస్ విషయాలున్నాయని, నాన్సెన్స్ ముసుగులో రచయిత సీరియస్ విషయాలు మాట్లాడాడని నొక్కి చెప్పిన విమర్శకులున్నారు. ఈ దృక్పథం ప్రకారం, వైల్డ్ సత్యం చెప్పి నవ్వించాడు. పిల్ల చేష్టల రూపంలో సీరియస్ వ్యంగ్యం రాశాడు. పెళ్లి, డబ్బు, విద్య, నిజాయితీ, వర్గ సంబంధాలు, మరణం ... ఎన్నెన్నో జీవన సమస్యలను స్పృశించాడు.
పాఠకులు ఈ నాటకాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. జీవన వాస్తవికతకు తిలోదకాలిచ్చిన కళారూపంగా, జీవితం మీద పరోక్షంగా వ్యాఖ్యానించే కళా రూపంగా.,.. రెండు విధాలుగానూ నాటకాన్ని పరిశీలించి, తమకు తాము ఒక అభిప్రాయానికి రావచ్చు.
- హెచ్చార్కె