జాంగా హనుమయ్య చౌదరి గారు మధ్య తరగతి రైతు కుటుంబంలో కృష్ణ జిల్లా, నందిగామ తాలూకాలోని వీరులపాడు గ్రామములో శేషయ్య లక్షమ్మ దంపతులకు జులై 1888 సంవత్సరంలో జన్మించారు. ఉద్దండ పండితులైన వడలి వైకుంఠశాస్త్రీగా గారు వారి గురువు. గ్రామంలో సాహిత్యకళకు అంకురార్పణ చేసిన వారు వైకుంఠశాస్త్రీ గారైతే, దానిని పెంచి పెద్దచేసి పోషించిన వారిలో జాంగా హనుమయ్య చౌదరి గారు అగ్రగణ్యులు.వారు తమ యూవనదశలోనే రచించిన కవితలు, విశ్లేషణలు యావత్ గ్రామప్రజలను సాహిత్యపు వెలుగులతో నింపాయి.వారు రచనావ్యాసంగానికి తోడుగా వ్యవసాయంలోనూ అత్యంత ఆసక్తిని కనబరిచినారు. తమ కమతంలో నిమ్మ, నరాంజీ, మామిడి, సపోటా, పనస మరియు అరటి తోటలను వేసి తాము పండితులము కవులమే కాము కర్షకులము కూడా యని చాటి చెప్పినారు. అయన ధూమపానం లేని కాఫీ , టి లు కూడా సేవించని నిష్ఠాగరిష్టులైన శాకాహారి.