ఇది సైద్ధాంతిక గ్రంధం కాదు. సాధారణ పాఠకులు కూడా శాస్త్రీయ అలోచనా విధానం కోసం ప్రయత్నం చేస్తే, తప్పకుండా సాధించగలిగిన అవకాశం ఇది. ఎడ్వర్డ్ కుంజ్ సరళమైన భాషలో ఆలోచనా విధానాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నం ఇది. ప్రతి ఒక్కరు ఆలోచనలో శాస్త్రీయత సంపాదించుకోవడానికి ఇది చాలా సులభమైన మార్గం. కుంజ్ 1930 వ దశకం మధ్య భాగంలో ఈ పుస్తకం రాశారు. ఆనాటికి ఆవిష్కరించిన దాదాపు అన్ని విషయాలను అయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. అయినప్పటికీ అయన చెబుతున్న ఆలోచనా విధానం ఈనాటికీ వర్తిస్తుంది.
- ఎడ్వర్డ్ కుంజ్