ఇది నిర్ణయసింధువు "నాకు తెలుగు చేత, మూలగ్రంథకర్త "మహా మహోపాధ్యాము" శ్రీ కమలాకర బట్ట మహాశయులు. ఈయన కాశీ పండితుడు.
ఇది, అనేక ధర్మ నిర్ణయములకు సింధువు వంటిది కావున నిర్ణయసింధువు. కమలాకర విరచితము కావునను, లేదా నిర్ణయము లనెడి కమలములకు స్థానము కానుకను దీనికి "నిర్ణయం కమలాకర "మని కూడా మరొక పేరున్నది.
ఒక దేశములో ఒక పనిచేయు ఆచారము ఉండును. దానిని పదిమంది మెచ్చుకొందురు. క్రమముగా అదియే ధర్మమై కూర్చుండును. "ఆచార ప్రభవో ధర్మః " ఆ చేసెడిపని విశ్వమందలి జనులందరికిని ఆచరణ యోగ్యమైనచో, సర్వశ్రేయస్కరమైనచో, అది ఉత్తమ ధర్మమగును.
-శ్రీ కొంపెల్ల వెంకటరామశాస్ట్రీ.