తెలుగు వాడు కాని తెలుగు రచయిత. "శారద" కలం పేరుతో రచనలు చేసిన ఎస్. నటరాజన్ తమిళుడు. పుదుక్కోటైలో 1925 ఫిబ్రవరి లో పుట్టాడు. తల్లి భాగీరథీ. తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ప్రపంచాన్ని అర్థిక మాంద్యం కుదిపేస్తున్న కాలం అది. మద్రాసు మహాపట్టణంలో బతకటం దుర్భరం కావడంతో తండ్రితో నటరాజన్ తెనాలి చేరాడు. అప్పుడు నటరాజన్ వయస్సు 12 ఏళ్ళు. తెలుగు ఏ మాత్రం రాదు. పనిచేసే క్రమంలో తెలుగు నేర్చుకోవడం అవసరం అయింది. వీధి బడిలో తెలుగులో మూడవ తరగతి వరకు చదువుకున్నాడు.
- వల్లూరి శివప్రసాద్