పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అన్ని ఖండాల్లోని పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆర్ధిక అసమానతలు పెరిగాయి. భారత దేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు. ఆర్ధిక సంక్షోభానికి తోడు కరోనా మహమ్మారి కాలంలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా - ఉదారవాద విధానాలు శ్రామిక ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. రైతులు, వివిధ సెక్షన్ల కార్మికులు, ఉద్యోగులు దేశవ్యాపిత పోరాటాల్లోకి వస్తున్నారు. ఈ ఆర్ధిక సంక్షోభం, దానికితోడు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ, భారత ఆర్ధిక వ్యవస్థలు నడుస్తున్న తీరుతెన్నులు , నడవాల్సిన మార్గాలను సూచిస్తూ ప్రముఖ ఆర్ధిక వేత్త ప్రభాత్ పట్నాయక్ రాసిన పుస్తక త్రయంలో ఇది ఒకటి.