Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

ముందుమాట

మధ్యతరగతి బతుకుల్ని చిత్రించిన కథలు

వ్యవసాయం దెబ్బతినడం వల్లా టవున్లో పలుచోట్ల వాచ్ మ్యాన్లుగా పనిచేసే రైతులు, పిల్లలు లేని కారణంగా అన్నదమ్ముల బిడ్డల్ని దత్తత చేసుకునే అక్కలు, తమ ఆడవారి 'అడ్డగోలు మాటలతో తమ మధ్యన అడ్డుగోడలు కట్టుకుని దూరమైపోయే అన్నదమ్ములు, అయినదానికీ, కానిదానికీ పని మనిషిని సాధించే శాంతమ్మలు, ఇంట్లో ఆడవారికంటే రుచిగా వంటలు వండి పెట్టే మగవాళ్ళు, ప్రతిదానికీ అనుమానాలు పెంచుకుని, భ్రమల్లో పడిపోయే మానసిక రోగులు, తోడబుట్టిన వారిని అభిమానించి, ఆదరించి హఠాత్తుగా కనుమరుగైపోయే ఆదర్శపురుషులు, తన తరపువారిని ఆదరంగానూ, భర్త తరపు వారిని

నిరాదరంగానూ చూసే కోడళ్ళు, అరుదుగానైనా సరే అత్తమామల్ని ప్రేమగా చూసే కోడళ్ళు, జనసంచారంలో పూలమ్మి పిల్లల్ని సాకే స్త్రీలు, సంతల్లో పూలమ్మి కడుపు నింపుకునే చిన్నపిల్లలూ, జీవితకాలంలో తమకంటూ ఒక చిన్న ఇల్లునైనా కట్టుకోవాలనుకునే సామాన్య ఉద్యోగులు, నిత్యం పేకాటలాడుతూ, బారుల్లో కూర్చుని కాలంగడిపే తిరుగుబోతులు, తాగుబోతులు, పిడికెడు పొట్టకూటికోసం కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుని బతికే ముసలమ్మలు, రోడ్డువార టిఫిన్లు, భోజనాలు సప్లయి చేస్తూ బతికే చిన్న చిన్న వ్యాపారస్తులు, వృద్ధులైన తల్లిదండ్రుల్ని వంతులు ప్రకారం పోషించే బిడ్డలు, ఉద్యోగం రాగానే అహాన్ని పెంచుకుని తిరిగే వ్యక్తులు... ఇంకా ఇలాంటి సామాన్యులెందరో మనకు కనిపిస్తూనే వుంటారు. మనతో బాటు శ్వాసిస్తూనే మనతోబాటు జీవిస్తూ వుంటారు... ఇలా కనిపించే మధ్యతరగతి వ్యక్తులూ, ఇంకా దిగువ మధ్యతరగతి మనుషులు ఈ సంఘే శక్తి కలియుగే' కథలలోను దర్శనమిస్తారు. ఉమామహేష్ ఆచాళం రాసిన ఈ కథలనిండా మధ్యతరగతి మనస్తత్వాలను నింపుకున్న పాత్రలే సజీవంగా మనతో సహజీవనం చేస్తున్నట్లే అనిపిస్తుంది.............