శ్రీ వాగ్గేయకారకుల చరిత్ర
- పురందరదాసు
16 వ శతాబ్దములో మధ్వబ్రాహ్మణ ధనిక కుటుంబీకుడు వరద కుమారుడు పురందరదాసు. ఈతని భార్య సరస్వతీ బాయను సంగీత వేదోపనిష ద్విద్యానిష్టాత. పండరీనాథ భక్తుడు.
తనయావదాసియు దానధర్మములకై వినియోగించిన ధర వ్రతుడు. కన్నడములో దేవర నామములు వ్రాసెను. కరాటు సంగీత పితామహ" అను బిరుదమును పొందెను. ఈతరు వేదాంత విషయికముగా అసంఖ్యాకములగు కీర్తనలు రచించెను సంగీత విద్యాభ్యాసమున కనుకూలముగా స్వరావళి.అలంకారములు గీతములు- తాయములు-సూళాదులు-ప్రబంధములు రచించెను. స్వర ములను మాయామాళవగౌళ రాగములో బోధించుట నీమహనీయుడే ప్రారంభించెనని పెక్కురు చెప్పుదురు.
- త్యాగరాజు ఆంధ్ర బ్రాహ్మణులు. రామబ్రహ్మం శాంతమ్మ పుణ్యదంపతుల | వరపుత్రుడు త్యాగరాజు. '1759-1847 ప్రాంతమువారు. వీరు తెనుగు దేశమునుండి దక్షిణ మునకు వలస వెళ్ళిరి. త్యాగరాజు కొంఠి వేంకట రమణయ్యగారి వద్ద సంగీతవిద్య నభ్యసించెను. సహజపాండిత్యము గల వారు. గురువీతని విద్యకై . ప్రత్యేక శ్రద్ధవహించెను. వీరిఅభిమానదైవము శ్రీరామచంద్రమూర్తి. ఇష్టదైవము పై భక్తికీర్తనలు వ్రాయుచు 96 కోట్లు రామనామము జపించి. సాక్షాత్కారసిద్ధినొందెను. నారదమహర్షి మీకి సన్న్యాసిరూపమున బ్రత్యక్షమై “స్వరార్ణవ" మను గ్రంథము నిచ్చినట్లు | చెప్పుదురు. ప్రహ్లాదభక్తి విజయము-నౌకా చరిత్రము అను గ్రంథములే కాక- కృతులు-దివ్యనామసంకీర్తనలు ఉత్సవ సంప్రదాయ కీర్తన ల నేకము రచించెను. ఈయన రచించినవి 2400 కృతులు అని చెప్పుదురు. వీరి కవిత్వము ద్రాక్షాపాకము, త్యాగరాజు యొక్క ప్రత్యేక.....