Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


              ఒక ధర్మం శక్తీ. ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక, దానిని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చి దిద్దుకునే హిందువుడే హిందూ ధర్మానికి ఉత్తమ ప్రచారకుడు. అట్టి మహా పురుషుల వల్లనే హిందూ ధర్మం నేటికీ నిలిచి ఉన్నది.

               మన లోపాలను మనం సంస్కరించుకోలేనిపక్షంలో లోక క్షేమం కోసం యత్నించే అధికారం మనకు లేదు. మానసిక దౌర్భల్యాన్ని అణచి, దుఖాతితుడై ఆత్మోపలబ్ధి నందుకొన్న వాడి ఉనికి ప్రపంచ సౌఖ్యానికి కారణ మవుతుంది. అతడు ప్రపంచ సంస్కరణకు పాటుపడనవసరంలేదు. లోక క్షేమం తానుగా సిద్ధిస్తుంది.