Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
“చిత్తశుద్ధి సంపాదనతోనే జ్ఞానప్రాప్తి, తద్వారా మోక్ష మార్గమునందుట మానవ జన్మకు పరమ ప్రయోజనము” అట్టి చిత్తశుద్ధి సంపాదనకై మహర్షులు అనేక సంస్కార కర్మలను ఏర్పరిచినారు. అందు ముఖ్యమైనవీ, ద్విజులందరూ అనుష్ఠించతగినవి పంచదశ సంస్కారములు. -
"సంస్క్రియతే చిత్త మనేనేత సంస్కారః” అని సంస్కార శబ్ద నిర్వచనము. ఇట్టి సంస్కార కర్మలను బోధించునవి. గృహ్య సూత్రములు. ధర్మ సూత్రములు. మనము ఆపస్తంబ సూత్రీయులము కనుక తదనుగుణమైన సూత్రానుసారముగా కర్మాచరణ చేయువలసియున్నది. ఇట్టియడ పూర్వము కొందరు పండితులు యాజుష పూర్వ ప్రయోగము అను పేర గ్రద్దములను వెలయించిరి. సుమారు -100 సంవత్సరములకు పూర్వము అప్పటి యాక్టికులకు అనుగుణముగా సంస్కృత పదములతో ఆ గ్రస్థములు ఉండుట, తెలుగులో వివరణ లేకుండుట మొదలగు కారణముల చేతనూ కొన్ని గ్రధ్ధములు ఆపస్తంబ సూత్రమునకు బదులుగా వేరు వాక్యములతో ఉండుట చేతనూ, ఇప్పటి కాలమునకు అనుగుణముగా సరైన వివరణలతో విద్యార్థులకు ఉపయోగపడు రీతిలో నేను ఉపాధ్యాయుడను కనుక విద్యార్థుల ప్రయోజనమునకై స్మార్త గ్రంథములను సంకలనము చేయదలచితిని. ఇప్పటికి భగవదనుగ్రహముతో 4 గ్రంథములు పూర్తి అయినవి. చివరగా 'సంస్కార మహోదధిః” అను పేర పంచదశ సంస్కారములు, వాటికి అవసరమైన ప్రాయశ్చిత్తాదులతో ప్రస్తుతము ప్రయోగభాగమును (పాఠ్యభాగమును) ముద్రించుచున్నాను. వీటికి గల మంత్ర, సూత్ర, కాల, విశేషాదులను సంకలనము చేయుచున్నాను.