విశాలమైన విశ్వము దీనిలో అనేక రకాల సౌరకుటుంబాల , నక్షత్రాల పాలా పుంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఎన్నో లోకాలు.
దీనిలో ఎక్కడో ఒక మూల ఒక చిన్న సౌరకుటుంబం దీనిలో ముఖ్యమైన తొమ్మిది గ్రహాలు ఇవి అపరిమితమైన వేగంతో తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యునిచుట్టు ప్రదక్షిణం చేస్తున్నాయి. ఎంతకాలం నుంచి చేస్తున్నాయో తెలియదు . ఎంతకాలం అలా తిరుగుతాయో, ఎసైన్సు చెప్పలేదు. ఎందుకంటే ఈ సైన్సు లెక్కల కంటే ఇంకా పెద్ద లెక్కలతో విశ్వనిర్మాణం ఉంది. ఎంత వేగం కల రాకెట్టులొ వెళ్ళినా ఈ భూమిపై సైంటిస్టులు ఈ విశ్వములో పాపు భాగం వరకు వెళ్ళి తిరిగి రావడానికి 100 సంవత్సరాలు కాలం సరిపోదు. ఈ విశ్వము అంతా చూసి రావాలంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు.
నిరంతరం తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ సూర్యనిచుట్టు తిరుగుతున్న ఈ గ్రాహం పైకి వెళ్ళే ఏ వస్తువునైనా తన వైపుకు లాగుకుంటుంది .