Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
1996 వ సంవత్సరంలో శివకుమార్ గురూజీ (హోస్పేట, బళ్లారి జిల్లా) గారి వద్ద N.S.Y (Natural System of Yoga) నేర్చుకున్నాను. విశిష్టమైన గురుతర బాధ్యతతో యోగ క్రియలు, ఆరోగ్య సూత్రాలు, శ్వాస సాధన, ప్రకృతి సిద్ధమైన ఆహారం, నియమాలు బోధించారు.
1998 వ సంవత్సరం నుండి బళ్లారిలో రెండుసార్లు, 2003 వ సంవత్సరం నుండి నాల్గు సార్లు హైదరాబాద్ లో ధ్యానం మాష్టారు “ధ్యానశ్రేష్ఠులు రామవరప్రసాద్ రావు గారు (పశ్చిమ గోదావరి జిల్లా)” క్లాసులు తీసుకున్నారు. ఆయన ప్రతి సాలులోనూ 40 రోజులు హిమాలయాల్లో ధ్యానంలో నిమగ్నమై ఉండేవారని ప్రతీతి.
శ్వాసక్రియలు, క్రియా యోగ (శరీరంలోని ఆరు నాడీ కేంద్రాలు), ధ్యాన సాధనలో నిష్ణాతులు. క్లాసులు తీసుకునే రోజుల్లో మా ఇంట్లోనే ఉండేవారు. యోగ, ధ్యానం, ఆరోగ్యానికి, మానసిక పరిణతికి ఎలా ఉపయోగపడతాయో విశదంగా బోధించేవారు. క్లాసులో దేవుడిని గురించి ప్రస్థావించేవారు కాదు.
నా సాధనా సారాంశం, మరియు వివిధ గ్రంథాల పఠనం ద్వారా గ్రహించిన పలు విషయాలను పొందుపరచి ఈ గ్రంథం వ్రాస్తున్నాను.
శ్వాస క్రియలు, క్రియా యోగ, ధ్యాన సాధనల వలన నాకు 81 సంవత్సరాల వయసు వచ్చినా, హృద్రోగాలుగాని, అనితర రుగ్మతలుగాని లేకుండా ఆరోగ్యంతో ఉన్నాను.
ఈ క్రియలను, ధ్యానాన్ని సాధన చేస్తూ, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, మనశ్శాంతిని, మానసిక నిశ్చలతనూ పొంది, ఎల్లరూ అర్థవంతమైన జీవితాలను పొందగలరని ఆశిస్తున్నాను.
- సి. నాగేశ్వరరావు