జ్యోతిషశాస్త్రము వేదములలో చెప్పబడిన శాస్త్రములన్నిటిలో ప్రధానమైనదిగా నిరూపింపబడినది. ఈ శాస్త్రము మానవునకు మూడవ నేత్రమువంటిదని తెలుసుకొన వలయును.
ఈ సృష్టియంతయు నవగ్రహముల సంచారము మీద ఆధారపడి యున్నది. నవగ్రహములలో ముఖ్యము లైనవియు మనకు కనబడునవియునగు సూర్య, చంద్ర గ్రహములే పైన తెలుపబడిన విషయమునకు ప్రత్యక్ష ప్రమాణములు.
సూర్య, చంద్ర గ్రహముల సంచారమును బట్టియే సంవత్సరములు ఋతువులు, మానములు, దినములు, ఏర్పడుచున్నవి. సూర్య చంద్ర గ్రహముల సంచారము బట్టియే ఈ ప్రాణికోటియు వృక్షమును జంతు జాలమును పుట్టుచు నశించుచున్నవి.
ఒక సారి జదివినచో సకల విషయములు ఎంత సులభముగ భోధపడునో మిరే తెలుసుకొనవచ్చును.
-వడ్డాది వీర్రాజు సిద్ధాంతి.