Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
'జాతీయం' చేయడం అంటే జాతిపరం చెయ్యడం అనే ఉదాత్త జాతీయోద్యమ భావన ఆనక ఎంతటి అపహాస్యానికి గురయిందీ మనకు తెలిసిందే. 'ఏరా పెన్ను బాగుంది ఎక్కడ జాతీయం చేసావ్' 'జనగణమనేనా' - ఇలా జాతీయోద్యమ కాలంనాడు రూపొందించుకున్న ఉదాత్త భావనలన్నీ అపభ్రంశమార్గం పట్టాయి. బూర్జువావర్గం సరదా అలాంటిది మరి. "ఈ ప్రపంచానికి 'స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం' అన్న నినాదాన్ని ఫ్రెంచి విప్లవం అందించింది 'రష్యావిప్లవం' 'చైనా విప్లవం' వియత్నాం విప్లవం 'క్యూబా విప్లవాలు' 'మరో ప్రపంచం సాధ్యమే' అన్న ఆశావహ దృక్పధాన్ని ఈ ప్రపంచానికి అందించాయి. దాంతో వీడితులు ఎక్కడ ఈ విప్లవాల వెంటబడిపోతారో అన్న గుబులుతో పీడకశక్తులు ఈ 'విప్లవం' అన్న పదాన్నే పలుచన చెయ్యడానికి యధాశక్తి కృషి చేసాయి. 'సస్యవిప్లవం' 'క్షీరవిప్లవం' 'నీలివిప్లవం' తో మొదలు పెట్టి నిన్నామొన్నటి 'డిజిటల్ విప్లవం' వరకూ అన్నీవిప్లవాలు'గా చలామణి చేసాయి. కానీ సాంస్కృతిక విప్లవం' 'సాహిత్య విప్లవం' జోలికి మాత్రం పోలేదు ఈ రెండు విప్లవాలు జరిగితే వాళ్ళ అడుగు జారిపోతుందని పాలకులకు తెలుసు. అందుకే వీటి జోలికి పోలేదు, పోరు కూడా... సాహిత్యంలో అలాంటి విప్లవ ప్రకంపనలు సృష్టించిన మహాకవి శ్రీశ్రీ' రచించిన ఈ ఎంపికచేసిన వ్యాసాల సంపుటి సాహిత్యకారుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉండితీరాలని నొక్కి చెప్పిన మహాకవి వాక్కు సదాస్మరణీయం, అనుసరణీయం. - సాహితీ స్రవంతి |