Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                        ముక్తి పొందిన తరువాత సాధకుడి స్థితి ఎలా ఉంటుంది? అసలు 'ముక్తి' అనేది సాధనవల్ల కలుగుతుందా? తత్త్వవిచారణవల్ల కలుగుతుందా? ఆర్ష సంప్రదాయకమైన ప్రధాన సాధనా విధానాలు ఎన్ని? సాధన ద్వారా సంస్కార క్షాళనము ఎలా జరుగుతుంది? తపస్సువల్ల సంస్కారములు నాశనమవుతాయా? వంటి ప్రశ్నలకు సమాధానంగా అద్భుత రీతిలో, నేటి సాధకులకు అర్థమయ్యే భాషలో సద్గురు శ్రీ శివానందమూర్తిగారు అందించిన దివ్యగ్రంథరాజము | "సాధన-సాధకుడు” (రెండవభాగం). ఈ రెండోభాగములో ఉన్నత స్థాయిలో | సాధనా పరమైన ఎన్నో అంశాల గురించి విశదముగా చర్చించిన ప్రసంగాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు, జ్ఞానం సృష్యారంభం నుంచే ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తు 20వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్నదని పాశ్చాత్య చరిత్రకారులే చెబుతున్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి అవతారాల మధ్య కాలం 27 వేల సంవత్సరాలుండవచ్చని పాశ్చాత్య చరిత్రకారుడు Sairel Fagon ఒప్పుకున్నారు. దీనినిబట్టి మనిషి ముక్తి మార్గమువైపు నడవాలన్న బోధ ఇప్పటికాదు. ఎప్పటిదో! ఇటువంటి అంశాలే కాక మరెన్నో  విషయాలను ఇందులో ఉటంకించారు.