ఇది ఒక మహారాజు కథ.
ఒక సాధకుడి కథ.
ఒక గురువు కథ. ఒక మహర్షి కథ.
ఒక మహారాజు తన జీవన ప్రయాణంలో
జరిగే ఒడిదుడుకులతో,
ఆటుపోటులతో ఆధ్యాత్మిక సాధకుడిగా
మారి కాలగమనంలో
సుమారు 180 సంవత్సరాలు జీవించి
తపస్వీజీగా ఎలా రూపాంతరం
చెందాడో తెలిపే అద్భుతమైన కథ.
ఇది అభూతకల్పన కాదు. యదార్ధ గాథ.
మనకంటే కొంతకాలం ముందు
భూమిపై నడయాడిన ఒక యోగి కథ మరియు ఆయన జీవిత చరిత్ర.
ఇది నిరంతరం ఆధ్యాత్మిక సాధన ఎలా సాగాలో తెలిపే గ్రంథం.
అందుకే ఇది "ముముక్షత్వం - ముళ్ళ కిరీటం"
వీరు 1770 ప్రాంతంలో పుట్టి 1955 లో సమాధి చెందారు.
వారి జీవన ప్రయాణమే, వారి అంతరంగ శిష్యుల
ఇంగ్లీషు మూలానికి తెలుగు అనువాదమే
ఈ పుస్తకం....
- T.S. అనంత మూర్తి, పూడిపెద్ది లక్ష్మణ మూర్తి, డా. గంటి దత్తాత్రేయమూర్తి