ఈ పుస్తకం మూడు భాగాలుగా విభజించబడింది. రష్యా విప్లవం మరియు వలసవాద వ్యతిరేక పోరాటాన్ని సైద్ధాంతిక చట్రంలో అవగాహనా కల్పించడం మొదటి భాగంలో వివరించబడింది. స్వాతంత్ర్య పోరాటానికి ముందటి కాలపు పరిస్థితులు - రష్యా విప్లవపు సారూప్యత రెండవ భాగంలో వివరించబడింది. స్వాతంత్ర్య తదనంతరం దశలో స్వతంత్ర భారతం మరియు సోవియట్ యూనియన్ సంబంధాలు మూడవ భాగంలో వివరించబడ్డాయి. సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రపంచ పరిస్థితులకు సంబంధించి సైతం కొన్ని వ్యాసాలు వివరించాయి.s