Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఓ మాట
రుక్మిణీశవిజయ మొక మహాకావ్యం. భాగవత దశమస్కంధంలోని కృష్ణకథ ఇందులో ప్రతిపాద్య విషయం. అది 19 సర్గల మహాకావ్యంగా రూపాన్ని పొందింది. 'రుగ్మిణీశవిజయమని కనివ్యవహరించిన పేరు. తెలుగువారికి రుక్మిణి అన్న పదమే బాగా పరిచయం. అందుకే జశ్వరహితంగా రుక్మిణి అన్న పదాన్నే స్వీకరించటం జరిగింది.
శ్లోక వ్యాఖ్యకు సంబంధించి - పదచ్చేదాన్ని విడిగా ఇవ్వలేదు. సాధారణస్థితిలో, బంధురయమకబంధమున్నచోట మాత్రమే పదచ్చేదాన్ని విడిగా చూపటం జరిగింది. ధాతువులు దాదాపుగా నిరనుబంధంగానే నిర్దేశింపబడ్డాయి. క్వాచిత్కంగా సానుబంధంగా కనిపించినా అవి అజనుబంధాలే.
శ్రీ రావి మోహనరావుగారి కోరిక మేరకు రుక్మిణీశవిజయాన్ని వ్యాఖ్యానించాను. సంస్కృత వాజ్మయానికి వారు వ్యక్తిగతంగా అందిస్తున్న వరివస్యకు మనసా, వాచా, కర్మణా
తెలుగువారికి పోకలు చెల్లించి తీరవలిసున్న వరివస్యకు మ్యాఖ్యానించారు. సంస్కృత
తెలుగువారికి పోతన భాగవతం సుపరిచితం. అందుకే కాలదృష్ట్యా పోతనకు దగ్గరవాడైన వాదిరాజకావ్యంలో పోతనను కూడా పోల్చి చూపటం జరిగింది. అవసరమనిపించిన తావులలో..
ఈ వ్యాఖ్య వ్రాయటానికి పట్టిన కాలం పదినెలలు. అంతే వేగంగా దీనిని ముద్రణకు సిద్ధం చేయించిన శ్రీ రావి మోహనరావుగారి ఉత్సాహాన్ని అగ్గింపక తప్పదు. వ్యాఖ్యను
వ్రాసేటప్పుడు నా మానాన నన్ను వ్రాసుకోనిస్తూ సహకరించిన కుటుంబసభ్యులకు పెద్దలకూ, పిల్లలకు కూడా ఆశీస్సులు.
రెండు సరళరేఖలు సృశించుకొంటే (ఖండించుకొంటే) బిందువేర్పడుతుంది. రెండు సంకల్పాలు (దైవ, మానుష) ఏకమైనపుడు ఒక కార్యం జరుగుతుంది. అలా ఈ వ్యాఖ్య సమకూరటానికైన దైవీ సంకల్పానికి నమస్సులు - శ్లో|| మోహముద్గర విభంగవారణా - నిస్తులాక్షి కిరదార్ధభావనా |
కాలకీలకమతిప్రకాశనా - మామచోదయదనమౌభావనా ||
- సూరం శ్రీనివాసులు.