Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹180

మనం - మన పూర్వీకులు

నేడు మనదేశంలో మానవుని చూస్తున్నాం. అతని సాంఘిక, రాజకీయ, మున జీవితాన్ని ఎరుగుదుం, అతని ఆహారం, వేషభాషలు, నిత్యావసరాలు ఏమిటో మనకు తెలుసు. "మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మార్పు జరుగుతూ వుంది. ఈ సంగతిని ఎవరూ కాదనలేరు. కాని ఆ మార్పు ఎంత తీవ్రంగా జరిగిందో తెలుసుకొనుట కషం. ఇందుకు నూరు సంవత్సరాల తేడాతో చారిత్రక కాలాన్ని, అంతకంటే ఎక్కువ తేడాతో చరిత్రకు పూర్వమున్న కాలాన్ని, సాంఘిక, ఆర్థిక, మతదృష్టితో పరిశీలిస్తే, మార్పు నమ్మకంగా తెలుస్తుంది. మనం క్రీ|| శ|| 1956 నుండి కాకుండా క్రీ॥ ఈ 1950 నుండి వెనక్కు పయనించుదాము. ఇక్కడ 1857 ను గురించి ఒకమాట చెప్పాలి.. 1857 లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయులైనందున మనదేశంలో ఆంగ్లరాజ్య స్థాపన జరిగింది. కాబట్టి చాలామంది మేధావులు •57ను చాలా చెడుగా భావిస్తారు. కాని 1657, 1557, 1457 మొదలైన సంవత్సరాల్లో అటువంటి అనిష్టాలు మనదేశంలో ఏమీ కానరావు. | క్రీశ 1950 1ఇప్పుడు మనం రాతియుగం, రాగియుగం, యినుపయుగం. తుపాకిమందు.

ఆవిరి యుగాలను దాటి పరమాణుయుగంలో ఉన్నాం. 2 వాయు మండలంపై మనకు అధికారముంది. గంటకు 500 మైళు వేగంతో పోయే విమానాలు ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. ఇక రైళ్ళు, మోటారు వాహనాల సంగతి చెప్పేదేముంది?

మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ. 4మన గణరాజ్యానికి రాష్ట్రపతి డా|| రాజేంద్రప్రసాదు. ఆయన మనదేశ రాజధాని

ఢిల్లీలో వుంటారు. మనకు ముఖ్యమైన సమన్వయ భాష హింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ

మొదలైన సాహిత్య భాషలున్నాయి. ఇవే కాకుండా మైథిలీ, మాగధీ, భోజపురి, ప్రజ, మాళవీ, రాజస్థానీ, కౌరవీ, పహాడీ మొదలైనవి కూడా సాహిత్య భాషలే.

(అవికూడా సాహిత్య భాషలవుతున్నాయి.) 6. మనం పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థలో వున్నాం. 7. మనచేతిలో రాజ్యాధికారాన్ని అట్టి పెట్టుకొనుటకు యుద్ధ విమానాలు, అణు

బాంబులు పరమాస్త్రాలుగా వున్నాయి. భీషణ ఫిరంగులు, మెషినుగన్నుల సంగతి

చెప్పనవసరం లేదు. 8. మనదేశంలో హిందూ మతం, ఇస్లాం మతం ముఖ్య మతాలు. కాని

విద్యావంతులకు ఆ మతాలపై పూర్వంవలె విశ్వాసం లేదు. 9. చదువుకొన్నవారు ఆహార పానీయాల్లో అంటును పాటించరు. వివాహాదుల్లో

కూడా కులగోత్రాలు కూలుతున్నాయి. 10. సాహిత్యాకాశంలో రవీంద్రుడు,

జయశంకరప్రసాదు అస్తమించారు. హిందీలో నిరాలా, సుమిత్రానంద పంతు యిప్పుడు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు.