Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఎం.ఎస్. గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ కు చాలాకాలం సరసంచాలక్ అయితే కె.బి. హెగడెవార్ ఆర్ఎస్ఎస్ పితామహుడు. సావర్కరను స్వయంగా హెగడెవార్ తన గురువుగా, తత్వజ్ఞానిగా, మార్గదర్శిగా అభివర్ణించి కీర్తించాడు. అందువల్ల గోల్వాల్కర్, సావర్కర్ రచనల నుండి ఎంపిక చేసిన భాగాలను ఇక్కడ రుజువులుగా చూపిస్తున్నాను. గోల్వాల్కర్ దృష్టిలో 'దేవుడు' “మనకిప్పుడు మనలోని సర్వశక్తులను ఉత్తేజపరిచే 'సజీవ' పరమాత్మ కావాలి. 'మన సమాజమే మన దేవుడు... హిందూ జాతే విరాట పురుషుడైన సర్వశక్తిమంతుని స్వరూపం' అని మన పెద్దలు చెప్పకనే చెప్పారు. వారు 'హిందూ' అనే పదాన్ని ప్రత్యేకించి వాడకపోయినా 'పురుష సూక్తం'లో వచ్చే ఈ కింది వర్ణనలో ఇది 'హిందూ' సంబంధితమేనని స్పష్టమౌతుంది - 'సూర్యచంద్రులే దేవుని కళ్ళు, అతని నాభి నుండి ఆకాశమూ, నక్షత్రాలూ అవతరించాయి. అతని శిరస్సు బ్రాహ్మణులు, బాహువులు రాజులు, తొడలు వైశ్యులు, పాదాలు శూద్రులు - ఈ చతుర్విధ (చాతుర్వర్ణ) వ్యవస్థను కలిగినవారే హిందువులు, అటువంటి విరాట పురుషుడే మన దేవుడు అన్నది దీని అర్థం." (ఉటంకింపు: గోల్వాల్కర్, బంచ్ ఆఫ్ థాట్స్) |