Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఎందరో శత్రువులు... అందరికీ వందనాలు!
నిశిత తర్కఖడ్గంతో తనని తానే ముక్కలుగా నరుక్కోవడం, చెదర గొట్టుకోవడం నిజంగా సాధ్యమా?
ఒకవేళ అలా ఖండించుకొన్నా, ఆ శకలాలని అతికించి తిరిగి ఒక రూపం యివ్వడం, ఆ శకలాల మధ్య వొక ఆత్మని పట్టుకోవడం సాధ్యమేనా?
ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నానంటే... యిటీవల మిత్రుడు కార్తీక్ ఆశ్చర్యాన్ని, దిగ్రమని వ్యక్తం చేశాడు. “మీరు రాసిన లాస్ట్ బ్రాహ్మిణ్ | గ్రంథాన్నే మీరు స్వయంగా ఖండించుకొన్నట్టుగా వుంది, 'అవధాని మరణం చదువుతుంటే...” అన్నాడు కార్తీక్.
మిత్రులు, మేధావి సుబ్రహ్మణేశ్వరరావుగారి అబ్బాయి కార్తీక్, మంచి ఆర్టిస్టు. ఇందులో కథలకి బొమ్మలు వేసింది అతనే.
అంటే నన్ను, నా కథలని, నా అభిప్రాయాలని ఎవరూ ఖండించక్కర లేదు. నన్ను నేనే ఎప్పుడో తెగ నరుక్కున్నాను అని, ప్రతిభావంతంగా బీభత్సకరమైన సింబాలిజంతో ఖండఖండాలుగా ముక్కలు చేసుకొన్నానని కార్తీక్ అన్నాడు. నేను 'అవధాని మరణం' 1992లో రాశాను. 'లా బ్రాహ్మిణ్' 2001లో ప్రచురితం. అంటే టైమ్ మెషీన్ ద్వారా కాలంలో.............