Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మంత్రాలలో గాయత్రిని మించిన మంత్రము దేవతల్లో తల్లిని మించిన దైవము లేదని నానుడి. గాయత్రీ మంత్రోపాసన సంధ్యావందనంలో భాగము. కానీ మారుతున్న జనుల మనోచిత్తముల కారణంగా (దీనికి కాలమార్పు అని చెబుతున్నారు) సంధ్యోపాసన బాగా తగ్గింది. బుద్ధి వికసనమే ఈ మంత్ర ముఖ్య ఫలితం. మానవుని బుద్ధి సరైన దారిలో ప్రసరిస్తే అన్ని చోట్లా శాంతి పరిఢవిల్లుతుంది. తప్పుదారి పట్టిన మానవ బుద్ధి ఎప్పటికీ వినాశకమే అని అందరికీ తెలుసు. ఈ మంత్రోపాసకులకు మానసిక శాంతి, ధీరత్వం, జ్ఞానం, సుబుద్ధి మొదలగునవి ఎందువల్ల కలుగుతాయో అనుబంధంలో వివరించడం జరిగింది. కొన్ని పాత గ్రంథాల ఆధారంగా ఇందులో విషయాలను నేను సంకలనం చెయ్యడం జరిగింది. సంధ్యావందనము అన్ని వేదశాఖలూ మరియు తైత్తిరీయ ఉపనిషద్ ప్రకారం ఉన్నాయి. అయితే ఈ పుస్తకంలో ఋగ్వేద సంధ్యావందనం ఇవ్వబడినది. ఈ మధ్య అక్కడక్కడ దొరుకుతున్న పుస్తకాలలో గాయత్రీ మంత్ర స్వరం అన్ని శాఖలకూ ఒకటిగానే ఇవ్వబడుచున్నది. నిజానికి ఋగ్వేద గాయత్రీ మంత్ర స్వరంలో కించిత్ భేదం ఉంటుంది. ఈ పుస్తకంలో గాయత్రీ మంత్రస్వరమును ఋగ్వేద ప్రకారంగా ఇవ్వబడినది.